🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 28 September 2026, 10:23 pm Posted by : peoplesvoice

భగత్ సింగ్ బాటలో యువత.. వ్యసనాలకు దూరంగా సాగాలి

News Image
భగత్ సింగ్ బాటలో యువత.. వ్యసనాలకు దూరంగా సాగాలి

చింతకాని, సెప్టెంబర్ 28 (ఆయుధం): కొదుమూరు గ్రామ డీవైఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతకాని మండల డీవైఎఫ్ఐ కార్యదర్శి నక్కనబోయిన అజయ్ గోపి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అజయ్ గోపి మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, ఆయన ఆశయాలను అందరిలో నింపుకోవాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కొదుమూరు గ్రామ డీవైఎఫ్ఐ కార్యదర్శి నక్కనబోయిన రాజేష్, అధ్యక్షులు బందెల జగదీష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
🏠 Home