🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 29 September 2026, 6:57 pm Posted by : peoplesvoice

అలై బలై కార్యక్రమంపై బండారు దత్తాత్రేయతో చర్చ .. జర్నలిస్టుల భాగస్వామ్యంపై కూడా చర్చ

News Image
అలై బలై కార్యక్రమంపై బండారు దత్తాత్రేయతో చర్చ

జర్నలిస్టుల భాగస్వామ్యంపై కూడా చర్చ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (ఆయుధం):

హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కపర్‌ ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలై బలై కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు.

కార్యక్రమ ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలతో పాటు అలై బలై కార్యక్రమ విశేషాలు, జర్నలిస్టుల భాగస్వామ్యం తదితర అంశాలపై బండారు దత్తాత్రేయతో వారు చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
🏠 Home