🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 8:56 am Posted by : peoplesvoice

పాతర్లపాడులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

News Image
పాతర్లపాడులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

చింతకాని మండలం, అక్టోబర్‌ 2 (ఆయుధం):
పాతర్లపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గాంధీజీ విగ్రహం వద్ద జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు, మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు తేలుకుంట్ల శంకర్రావు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు కూడా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home