🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 7:57 pm Posted by : peoplesvoice

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

News Image
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

చింతకానిలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం

చింతకాని, అక్టోబర్ 2 (ఆయుధం):

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జిల్లా కార్యవర్గ సభ్యులు గార్లపాటి రమేష్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చింతకాని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో స్థానిక చింతకాని సెంటర్‌లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గార్లపాటి రమేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య భద్రత, ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడుతామని తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మండల బాధ్యులు పెరిక నాగేశ్వరరావు, మంద శివ, అలవాల వెంకట నరసయ్య, చిట్టూరి నరేష్, అంబటి శాంతయ్య, తూము నరసింహారావు, గండారపు రామారావు, జొన్నలగడ్డ మల్లేశ్వరి, గడ్డం విజయ్, వేల్పుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home