🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 12:59 pm Posted by : peoplesvoice

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

News Image
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

ఎన్నికల కమిషన్‌లో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

చింతకాని, అక్టోబర్ 05 (పీపుల్స్ వాయిస్): ఇండియా కూటమి పిలుపు మేరకు చింతకాని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ మండల కమిటీల ఆధ్వర్యంలో సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్, సీపీఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్, సీపీఐ మండల సహాయ కార్యదర్శులు అబ్బూరి మహేష్, మార్గం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల గోవిందరావు, బందెల నాగార్జున, ఆలస్యం బసవయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home