🔥 18–35 ఏళ్ల యువతకు బిగ్ న్యూస్! 🔥 ప్రభుత్వం సర్వే షురూ నిరుద్యోగ యువత వివరాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
🔥 18–35 ఏళ్ల యువతకు బిగ్ న్యూస్! 🔥
ప్రభుత్వం సర్వే షురూ
నిరుద్యోగ యువత వివరాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 7 (పీపుల్స్ వాయిస్ ): గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ యువత వివరాలను సేకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపడుతోంది. ఈజీఎంఎం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ వివరాలను సేకరిస్తున్నారు.
రాష్ట్రంలోని 12,760 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా నిరుద్యోగ యువతకు సంబంధించిన వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది.
నిరుద్యోగుల పేరు, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు తదితర సమాచారాన్ని తెలంగాణ ఇ-పంచాయత్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించింది. సేకరించిన వివరాలను పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరించి సమర్పించాల్సి ఉంటుంది.
ఉపాధి, నైపుణ్య శిక్షణపై ఫోకస్
సర్వే ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా నిరుద్యోగ యువతకు వివిధ రకాల వృత్తి నైపుణ్య శిక్షణ అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈజీఎంఎం, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టనుంది.
ఇటీవల ఈజీఎంఎం అధికారులు నిర్వహించిన సమావేశంలో పలు కార్పొరేట్ సంస్థలు గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి అనుగుణంగా యువత విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.
📌 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.