టీసీ కోసం అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించిన విద్యార్థిని అదనపు ఫీజులు, పెనాల్టీ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ
టీసీ కోసం అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించిన విద్యార్థిని
అదనపు ఫీజులు, పెనాల్టీ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ
ఖమ్మం, అక్టోబర్ 7 (పీపుల్స్ వాయిస్):
ఫీజులు చెల్లించినప్పటికీ టీసీ, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అదనపు ఫీజులు, పెనాల్టీ డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని జిల్లా అధికారులను ఆశ్రయించింది.
ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి దీపిక 2021లో ఖమ్మంలోని పులిపాటి ప్రసాద్ GNM నర్సింగ్ కాలేజీలో చేరింది. మొదటి సంవత్సరం ఫీజు పూర్తిగా చెల్లించినప్పటికీ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా రెండో సంవత్సరం చదువును మధ్యలోనే నిలిపివేసినట్లు తెలిపింది.
అయితే తన టెన్త్, ఇంటర్ మెమోలు, టీసీ తదితర ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యం ఇవ్వడం లేదని, 4వ సెమిస్టర్ నుంచి 5వ సెమిస్టర్ వరకు ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది.
తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్టిఫికెట్లు, టీసీ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ పిన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, DICOకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థినితో పాటు పడిశాల మధుసూదన్ రావు, ఎస్.కె. మస్తాన్ (PDSU), దుమాల నాగరాజు (ఖమ్మం ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి) తదితరులు పాల్గొన్నారు.