రైతులను తక్షణమే ఆదుకోవాలి
రైతులను తక్షణమే ఆదుకోవాలి
ఎలినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి రైతులకు తీవ్ర నష్టం
పశుగ్రాసాన్ని సబ్సిడీపై అందించాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్
చింతకాని, అక్టోబర్ 15 ( పీపుల్స్ వాయిస్): తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు కోడుమూరు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఎలినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలపై వర్షాభావ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి
పంటల దిగుబడులు తగ్గి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కొండపర్తి గోవిందరావు డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు కూడా తగిన గుర్తింపు కల్పించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా పశువులకు పశుగ్రాసం దొరకని పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. పశువులను పోషించుకోవడం రైతులకు భారంగా మారుతోందని పేర్కొంటూ, రైతులకు సబ్సిడీపై పశుగ్రాసం అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను గుర్తించి, పంట నష్టాలకు తగిన పరిహారం అందించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూచిపూడి రవి, ఏఐకేఎస్ చింతకాని మండల అధ్యక్షుడు దొబ్బల వెంగళరావు, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి నీరుడు గోవిందరావు, సహాయ కార్యదర్శి చల్లగుండ్ల సాయి, మండల నాయకుడు నారపోగు నాగార్జున, ఏఐవైఎఫ్ గ్రామ కార్యదర్శి గాడిదల అనిల్, మాజీ ఉపసర్పంచ్ కోటగిరి ప్రభూషణచారి, సీపీఐ గ్రామ నాయకులు కూచిపూడి వెంకటేశ్వర్లు, జనగాం వెంకటేశ్వర్లు, నూకల నాగయ్య, నీరుడు ఖాదర్ బాబు, నారపోగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.