కిష్టారం ఓసీలో దుర్గామాతను దర్శించుకున్న ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు

కిష్టారం, అక్టోబర్ 16 ( పీపుల్స్ వాయిస్ ) :
కిష్టారం ఓసీలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఐఎన్టీయూసీ సత్తుపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిష్టారం ఓసీ ఫిట్ సెక్రటరీ షణ్ముఖాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
అనంతరం నిర్వహించిన సహపంక్తి భోజన కార్యక్రమంలో కోటేశ్వరరావు పాల్గొని నాయకులు, కార్మికులతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ బుడిగం రామకృష్ణ, దేవదాస్, బ్రాంచ్ సెక్రటరీ మురళీకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ కేడం కోటేశ్వరరావు, జగదీష్, అరుణ్, సంతోష్, నాగేంద్ర, వినోద్, వెంకటేశ్వర్లు, అధిరెడ్డి వెంకటేశ్వర్లు, కొంటూ సుధాకర్, రఫూఫ్, భాస్కర్, దొంతమళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.