లకారం జంక్షన్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ 5 బుల్లెట్ వాహనాలు స్వాధీనం.. నంబర్ ప్లేట్లు లేని 25 వాహనాలకు జరిమానాలు
లకారం జంక్షన్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
5 బుల్లెట్ వాహనాలు స్వాధీనం.. నంబర్ ప్లేట్లు లేని 25 వాహనాలకు జరిమానాలు
ఖమ్మం, అక్టోబర్ 16 ( పీపుల్స్ వాయిస్ ) : ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐలు రవి, రాము సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం లకారం జంక్షన్ వద్ద ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, వాహనాలు నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడటం, అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బుల్లెట్ మోటార్ సైకిళ్లకు అమర్చడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఐదు బుల్లెట్ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నంబర్ ప్లేట్లు లేని 25 వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు.
ప్రతి వాహనానికి ముందు, వెనుక స్పష్టంగా కనిపించేలా నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించరాదని, అధిక శబ్దం కలిగించే నిబంధనలకు విరుద్ధమైన సైలెన్సర్లను ఉపయోగించరాదని తెలిపారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చేపట్టే ప్రత్యేక తనిఖీలకు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.