🏠 www.peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 8:38 pm Posted by : పీపుల్స్ వాయిస్

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

News Image
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఖమ్మం, అక్టోబర్ 18 ( పీపుల్స్ వాయిస్ ) :

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కనులవిందుగా మారింది.

పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు ఆడుతూ, జానపద గేయాలతో పండుగ సందడిని మరింత పెంచారు.

ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. వేడుకలకు హాజరైన మహిళలు, కార్యకర్తలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

భక్తిశ్రద్ధలతో సద్దుల నివేదన

బతుకమ్మ వేడుకల్లో భాగంగా గౌరమ్మకు వివిధ రకాల సద్దులను భక్తిశ్రద్ధలతో నివేదించారు. అనంతరం వాటిని ప్రసాదంగా పంపిణీ చేసుకున్నారు. మహిళలు ఒకరికొకరు సద్దులు మార్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

వేడుకల అనంతరం బతుకమ్మలకు మంగళహారతులు సమర్పించి, సంప్రదాయబద్ధంగా నిమజ్జనానికి సాగనంపారు. పాటలు, కోలాటాలు, పూల బతుకమ్మలతో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం పండుగ శోభను సంతరించుకుంది.
🏠 Home