సేవా స్ఫూర్తికి సలాం.. డాక్టర్ పులిపాటి ప్రసాద్‌కు ప్రశంసల జల్లు!
కాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరికి ఘన సత్కారం.. నిరుపేదలకు అన్నదానం, వస్త్రాలు, పండ్ల పంపిణీ
ఖమ్మం, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్):
డాక్టర్ పులిపాటి ప్రసాద్ అందిస్తున్న సామాజిక సేవలు ఆదర్శనీయమని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, ఖమ్మం పౌర సమితి బాధ్యులు, ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ కాశీం, పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కొనియాడారు.
ఇటీవల నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన నిర్వాహకులు, సభ్యులు, భక్తులు, పులిపాటి నగర్ కాలనీవాసులను అభినందిస్తూ డాక్టర్ పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం నగరంలోని డాక్టర్ పులిపాటి ప్రసాద్ నివాసంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరిని ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు, ప్రముఖులు, నిర్వాహకులను గౌరవించి వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. నిరుపేదలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, డాక్టర్ పులిపాటి ప్రసాద్ చేపడుతున్న సామాజిక, ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. భక్తులు, ప్రముఖులను గౌరవించడం, నిరుపేదలకు అన్నదానం, వస్త్రాలు, పండ్లు పంపిణీ చేయడం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. పులిపాటి పారామెడికల్ కళాశాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయడం అభినందనీయమని కొనియాడారు. డాక్టర్ పులిపాటి ప్రసాద్, పద్మప్రియ దంపతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ప్రముఖుల హాజరు
డాక్టర్ పులిపాటి ప్రసాద్, పద్మప్రియ దంపతుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పట్నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ మాధవరావు, ఖమ్మం పౌర సమితి ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొదుమూరు జగన్నాథం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యదర్శి వరప్రసాద్ రావు, సభ్యులు పవన్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, బి. సతీష్, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అరుణబా, పౌర సమితి ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, నాయకులు శ్రీనివాస్, 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. కోటేశ్వరరావు, కూచిపూడి నాట్యకారిణి ఏలూరి మీనా, యాంకర్ భారతి, ఖమ్మం పౌర సమితి నాయకులు ఎం.డి. హకీమ్, రఫీక్, రెహమాన్, ఉపాధ్యక్షులు పవన్, కార్యనిర్వాహకులు సందీప్, హరీష్, రాణి, రేవతి, అనిల్, సుమన్, కుమారి పులిపాటి శ్రీలేఖ్య తదితరులు పాల్గొన్నారు.