Poples Voice
Date of Publish : 22/10/2026, 9:06 pm
Published by PEOPLES VOICE

పేదరికాన్ని జయించి డాక్టర్ కల సాకారం.. పందిరి ఆనంద్‌కు ఎంబీబీఎస్ సీటు!

  • పేదరికాన్ని జయించి డాక్టర్ కల సాకారం.. పందిరి ఆనంద్‌కు ఎంబీబీఎస్ సీటు!
  • మాజీ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడికి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకుల ఘన సన్మానం

పేదరికాన్ని జయించి డాక్టర్ కల సాకారం.. పందిరి ఆనంద్‌కు ఎంబీబీఎస్ సీటు!

మాజీ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడికి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకుల ఘన సన్మానం

ముదిగొండ, అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్): పేదరికాన్ని అధిగమించి పట్టుదలతో చదివి నీట్‌లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు సంపాదించిన ముదిగొండకు చెందిన మాజీ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు పందిరి ఆనంద్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు, గ్రామస్తులు ఆనంద్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు మల్లికార్జున్, లక్ష్మీలను సైతం సత్కరించి అభినందించారు.

విద్యార్థి ఉద్యమం నుంచి వైద్య విద్య వరకు..

పేద కుటుంబంలో జన్మించిన పందిరి ఆనంద్ విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐలో చురుకుగా పనిచేస్తూ విద్యారంగ సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే చదువుపై తనకున్న ఆసక్తిని కొనసాగించారు. కష్టపడి చదివి నీట్‌లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు సంపాదించడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా కీలక అడుగు వేశారు.

విద్యార్థులకు ఆదర్శంగా ఆనంద్ విజయం

ముదిగొండ గ్రామం నుంచి ఆనంద్ ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పేదరికం విజయానికి అడ్డుకాదని, పట్టుదల, కృషి, చదువుపై ఆసక్తి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఆనంద్ నిరూపించారని కొనియాడారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూనే చదువులో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆనంద్ విజయం ముదిగొండ విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బట్టు రాజు, జాన్ పాషా, కాటం రాజు, కాంచాని రవి, పుచ్చకాయల సురేష్, రేఖ వీరబాబు, యాకుబ్ పాషా, అక్షయ్, మహేష్, నాగరాజు, సుభాష్, బుర్ర సాయికుమార్, వెంకటేష్, సీహెచ్ రవి, గోపి, వినయ్, రోహిత్, రామకృష్ణ, యుగంధర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save