Poples Voice
Date of Publish : 23/10/2026, 6:08 pm
Published by PEOPLES VOICE

నాగులవంచలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

  • నాగులవంచలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
  • డ్రైనేజీలు, బస్టాండ్‌ పరిసరాల్లో చెత్త తొలగింపు

నాగులవంచలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

డ్రైనేజీలు, బస్టాండ్‌ పరిసరాల్లో చెత్త తొలగింపు

చింతకాని, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. గ్రామంలోని సైడ్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు బస్టాండ్‌, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రత పనులు నిర్వహించారు.

గ్రామంలో పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పడం, మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోకుండా చూడటం, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా గ్రామపంచాయతీకి సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారగాని రాంబాయి, ఉపసర్పంచ్ అంబటి శరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save