Poples Voice
Date of Publish : 23/10/2026, 6:50 pm
Published by PEOPLES VOICE

అమెరికాలో ఖమ్మం యువతి మృతి

అమెరికాలో ఖమ్మం యువతి మృతి

న్యూయార్క్‌లో గుండెపోటుతో నల్లమల అక్షిత కన్నుమూత

ఖమ్మం, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):

అమెరికాలోని న్యూయార్క్‌లో ఖమ్మానికి చెందిన నల్లమల అక్షిత (యువతి) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అక్షిత తండ్రి నల్లమల ఆనంద్ ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతుల విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. నగరంలోని మమతా రోడ్డులోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లిన యువతి అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save