Poples Voice
Date of Publish : 23/10/2026, 7:44 pm
Published by PEOPLES VOICE

మల్లవరం పాఠశాల అభివృద్ధిపై కేటీఆర్ ప్రశంసలు

  • మల్లవరం పాఠశాల అభివృద్ధిపై కేటీఆర్ ప్రశంసలు
  • శ్రీరఘునందన్‌ను సన్మానించిన మాజీ మంత్రి

మల్లవరం పాఠశాల అభివృద్ధిపై కేటీఆర్ ప్రశంసలు

శ్రీరఘునందన్‌ను సన్మానించిన మాజీ మంత్రి

తల్లాడ, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న దుగ్గిదేవర శ్రీరఘునందన్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయనను సన్మానించారు.

2016 ఫిబ్రవరి 17న పాఠశాలను దత్తత తీసుకున్న శ్రీరఘునందన్ పదేళ్లుగా మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, పచ్చదనం, జల సంరక్షణకు కృషి చేస్తున్నారు. ఆయన, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో పాఠశాలకు జాతీయ, రాష్ట్ర స్థాయి స్వచ్ఛ పురస్కారాలు లభించాయని కేటీఆర్ పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి వివరాలను కేసీఆర్, సినీ నటుడు మహేశ్‌బాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుగ్గిదేవర సామ్రాజ్యం, దుగ్గిదేవర వెంకటలాల్, అజయ్‌కుమార్, యుధిష్టర్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save