పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కొత్త రుణాలు పొందాలని రైతులకు సొసైటీ చైర్మన్ యలగొండ స్వామి సూచన
ముదిగొండ, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):
ముదిగొండ విశాల సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులు కొత్త పంట రుణాలు పొందవచ్చని సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు పంట రుణాలు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సంఘం నుంచి రుణాలు పొందిన రైతులు వాటిని రెన్యువల్ చేయించుకునేందుకు సిబ్బందికి సహకరించాలని యలగొండ స్వామి కోరారు.