అనగాని సూరమ్మ మృతికి సంతాపం తెలిపిన నాయకులు
నాగులవంచలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ
చింతకాని , అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):
బీజేపీ ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా కార్యదర్శి అనగాని రామారావు తల్లి అనగాని సూరమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. శనివారం సూరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో నాగులవంచ గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, శ్రీ గజగిరి లక్ష్మీనరసింహస్వామి, శ్రీ కోదండరామస్వామి దేవాలయాల మాజీ చైర్మన్ నారగాని శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డెబోయిన ఇందిర, నర్సింహారావు, వడ్డెబోయిన రామేశ్వరరావు, గ్రామ పెద్ద శిలివేరు సైదులు తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.