Poples Voice
Date of Publish : 24/10/2026, 7:22 pm
Published by PEOPLES VOICE

రూ.2 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు అవాస్తవం

రూ.2 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు అవాస్తవం

ఆరోపణలను ఖండించిన హైదర్‌సాయిపేట సర్పంచ్ సీమ్లా నాయక్

తిరుమలాయపాలెం, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):

హైదర్‌సాయిపేట గ్రామ సర్పంచ్ సీమ్లా నాయక్ రూ.2 లక్షలు డిమాండ్ చేశారంటూ కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన ఖండించారు.

గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూమి వివాదం తలెత్తడంతో వారు తనను సంప్రదించారని తెలిపారు. ఈ క్రమంలో సుమారు 10 మంది గ్రామ పెద్దల సమక్షంలో ఇరువురి వాదనలు విని పంచాయతీ నిర్వహించినట్లు వివరించారు. అయితే, ఈ వ్యవహారంలో తాను ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.

తనపై నిరాధార ఆరోపణలతో వార్తలు ప్రచురించడం సరికాదని పేర్కొంటూ, ఇలాంటి ప్రచారం కొనసాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీమ్లా నాయక్ హెచ్చరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save