Poples Voice
Date of Publish : 25/10/2026, 9:55 am
Published by PEOPLES VOICE

మహా ధర్నాను జయప్రదం చేయాలి

మహా ధర్నాను జయప్రదం చేయాలి

ఎంపీఓకు వినతిపత్రం అందజేసిన సీఐటీయూ నాయకులు

ముదిగొండ, అక్టోబర్ 25 (పీపుల్స్ వాయిస్):

ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ముదిగొండ మండల ఎంపీఓ రామకృష్ణకు సీఐటీయూ మండల నాయకులు వినతిపత్రం అందజేశారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాకు కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్.కె. హుస్సేన్, ఇరుకు రాము, పల్లెపొంగు రవి, పల్లపాటి శ్రీకాంత్, ఉపేందర్, నాగేశ్వరరావు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save