భారత్‌లోకి ప్రవేశించిన పాక్ జాలర్లు.. నలుగురిని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్
అంతర్జాతీయం, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్)
భారత జలాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నలుగురు పాకిస్థానీ జాలర్లను గుజరాత్‌లోని కచ్ జిల్లా సర్ క్రీక్ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద ఉన్న ఫైబర్ ఫిషింగ్ బోటును స్వాధీనం చేసుకున్నారు.
నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహించి వారిని గుర్తించినట్లు కథనం పేర్కొంది. అదుపులోకి తీసుకున్నవారిని ఖాదిర్ తైమూర్, మహమ్మద్ ముస్సా, అజ్గర్ తైమూర్, అహషాక్ జత్ లుకాగా గుర్తించినట్లు, వీరు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారని అధికారులు తెలిపినట్లు పేర్కొంది.
వారు భారత జలాల్లోకి ప్రవేశించిన పరిస్థితులు, ఉద్దేశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.