Poples Voice
Date of Publish : 27/10/2026, 7:07 pm
Published by PEOPLES VOICE

బిర్యానీలో బొద్దింక.. మధిర మేఘన రెస్టారెంట్‌లో కలకలం!

  • బిర్యానీలో బొద్దింక.. మధిర మేఘన రెస్టారెంట్‌లో కలకలం!
  • ఆహార భద్రతపై ఆందోళన.. రెస్టారెంట్‌లో తనిఖీలు చేయాలని ప్రజల డిమాండ్

బిర్యానీలో బొద్దింక.. మధిర రెస్టారెంట్‌లో కలకలం

ఆహార భద్రతపై ఆందోళన.. తనిఖీలు చేయాలని ప్రజల డిమాండ్

మధిర, పీపుల్స్ వాయిస్: మధిర బస్టాండ్‌ రోడ్డులోని మేఘన ఫ్యామిలీ రెస్టారెంట్‌లో చికెన్‌ బిర్యానీలో బొద్దింక కనిపించిందని ఓ కస్టమర్‌ పేర్కొనడం కలకలం రేపింది. ఆహారంలో బొద్దింకను గుర్తించిన కస్టమర్‌ రెస్టారెంట్‌ యాజమాన్యాన్ని వివరణ కోరినట్లు తెలిసింది. అయితే, పొరపాటున పైనుంచి పడి ఉండవచ్చని యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో రెస్టారెంట్‌లో ఆహార తయారీ, పరిశుభ్రత ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత ఆహార భద్రతా అధికారులు వెంటనే స్పందించి రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save