ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎమ్మార్పీఎస్ పరామర్శ
బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్
చింతకాని, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్):
తిర్లాపురం రోడ్డులో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన తిమ్మినేనిపాలెం గ్రామ బాధితులను ఎమ్మార్పీఎస్ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని, కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. ట్రాక్టర్ యజమానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. ప్రమాద సమయంలో తక్షణమే స్పందించిన అంబులెన్స్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చింతకాని మండల అధ్యక్షుడు నారపోగు నాగేంద్రబాబు, ఎంఎస్పీ నాయకుడు బలవంతపు రాజు, చిల్లపల్లి మధు, పగిడిపల్లి రవీంద్ర, చిర్రా ఉపేందర్, వేల్పుల హరికృష్ణ, గుండ్ల రాంబాబు, నారపోగు ఉదయ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు కొమ్ము నరేష్, తిమ్మినేనిపాలెం సర్పంచ్ కొమ్ము ప్రభు, తిర్లాపురం సర్పంచ్ వీరబాబుతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.