Poples Voice
Date of Publish : 28/10/2026, 8:05 am
Published by PEOPLES VOICE

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో

  • అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో
  • టీచర్‌, ఆయా సస్పెన్షన్‌కు హామీ.. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఉద్యోగం

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో

టీచర్‌, ఆయా సస్పెన్షన్‌కు హామీ.. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఉద్యోగం

ఖమ్మం, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్):
 ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రాంతంలో అంగన్‌వాడీ కేంద్రంలో విషపురుగు కాటుతో చిన్నారి మృతి చెందిన ఘటనపై ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్రంలో మౌలిక సదుపాయాలు, రక్షణ చర్యలు లేకపోవడమే ఘటనకు కారణమని ఆరోపిస్తూ సీపీఐ, సీపీఎం, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, బీఆర్‌ఎస్‌, పీడీఎస్‌యూ తదితర సంఘాల ఆధ్వర్యంలో టేకులపల్లి బ్రిడ్జి సమీపంలోని బైపాస్‌ రోడ్డుపై మూడు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయాను సస్పెండ్‌ చేయాలని, బాధిత పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణను పెంచాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

ఆందోళన నేపథ్యంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ధర్నా స్థలానికి చేరుకుని నాయకులతో చర్చలు జరిపారు. అంగన్‌వాడీ టీచర్‌, ఆయాను సస్పెండ్‌ చేస్తామని, ఇల్లు లేని బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కేటాయిస్తామని, కుటుంబంలో ఒకరికి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save