Poples Voice
Date of Publish : 28/10/2026, 8:31 am
Published by PEOPLES VOICE

ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి - సి.వై. పుల్లయ్య డిమాండ్‌

  • ఖమ్మం జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి
  • ఎల్‌నినో ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలి
  • రైతులకు కరువు నివారణ చర్యలు చేపట్టాలి
  • అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
  • ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి గ్రామ సర్పంచులకు అధికారాలు కల్పించాలి

ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య డిమాండ్‌

వైరా, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్):
ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నందున ఖమ్మం జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి, రైతాంగానికి కరువు నివారణ చర్యలతోపాటు ఆర్థిక సహాయం అందించాలని సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య డిమాండ్‌ చేశారు.

వైరాలోని విక్రమ్‌ భవన్‌లో గుగులోతు శివ అధ్యక్షతన జరిగిన సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ వైరా డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పంట నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి గ్రామ సర్పంచులకు అధికారాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

పార్టీ వైరా డివిజన్‌ ఇన్‌చార్జి గండమల రామయ్య మాట్లాడుతూ పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి సర్పంచులకు అధికారాలు అప్పగించాలని కోరారు.

ఈ సమావేశంలో సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ వైరా డివిజన్‌ కార్యదర్శి ఎస్‌.కె. లాల్మియా, డివిజన్‌ నాయకులు పాశం అప్పారావు, ఎలదండి బాబు, కొండే వెంకటేశ్వర్లు, గుగులోతు శివ, మేడికొండలరావు, కే. దర్గయ్య, గోగుల సోములు, రాపోలు కృష్ణ, గండికోట లక్ష్మణ్‌, ఎస్‌.కె. జానీ, బండారి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save