Poples Voice
Date of Publish : 28/10/2026, 4:54 pm
Published by PEOPLES VOICE

చింతకానిలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

చింతకానిలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

చింతకాని, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్ ): 

ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఆలయ ఈవో రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సపతి శివశంకర్, కాంట్రాక్టర్ రత్నాకర్, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ ఎండపల్లి శ్రీనివాసరావు, పేరమ్మ దంపతులు, కొమ్మిని రామారావు, పెద్ద గౌండ్ల వెంకటనారాయణ, తూము భిక్షం, బండి తిరపయ్య, కోడవకంటి రాంబాబు, పగిడిపల్లి నవత శంకర్ దంపతులు, చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్మటి వెంకటేశ్వరరావు, ఖమ్మం మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడుపల్లి భాస్కర్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు కొప్పుల గోవిందరావు, బందెల నాగార్జున, ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్.కె. కాసిం, సీపీఎం మండల కార్యదర్శి దేశబోయిన ఉపేందర్, చింతకాని మాజీ సర్పంచ్ బండి సైదేశ్వరరావు, కొమిని నాగేశ్వరరావు, కోల శ్రీను, బండి వెంకటేశ్వర్లు, మల్లెల సత్యనారాయణతో పాటు పలువురు గ్రామ పెద్దలు హాజరయ్యారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save