Poples Voice
Date of Publish : 28/10/2026, 6:33 pm
Published by PEOPLES VOICE

ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన షేక్ మీరా సాహెబ్

ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన షేక్ మీరా సాహెబ్

చింతకాని, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్): తిమ్మినేనిపాలెం గ్రామంలో సోమవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను బీఆర్‌ఎస్ నాయకుడు షేక్ మీరా సాహెబ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

ప్రమాదంలో గాయపడిన కూలీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రమాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్య, బీఆర్‌ఎస్ నాయకులు దేశబోయిన సురేష్, బెల్లంకొండ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save