ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుక
ఖమ్మం, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్): ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన గౌరవ అధ్యక్షుడు అంబేద్కర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగరాజు రక్తదానం చేశారు.
వేడుకల్లో భాగంగా సీడీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక సేన కళాకారులు ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.