Poples Voice
Date of Publish : 29/10/2026, 11:10 am
Published by PEOPLES VOICE

పొన్నం జానకిరామయ్య మృతి.. పలువురు నాయకుల నివాళి

పొన్నం జానకిరామయ్య మృతి.. పలువురు నాయకుల నివాళి

చింతకాని, అక్టోబర్ 29 (పీపుల్స్ వాయిస్): వందనం గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు పొన్నం శంకర్రావు తండ్రి పొన్నం జానకిరామయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం అకాలంగా మృతి చెందారు.

జానకిరామయ్య మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, చింతకాని సర్పంచ్ కిలారి మనోహర్, కొప్పుల గోవిందరావు, కూరపాటి కిషోర్, పెంట్యాల అప్పారావు, వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, మండల మైనార్టీ సెల్ నాయకుడు పాషా, వందనం గ్రామ శాఖ నాయకులు షేక్ మోయిన్, షేక్ జాహుర్, పాశం సంజీవరెడ్డి, పొన్నం శంకర్రావు (పెద్ద) తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save