బల్లి పెద్ద వీరయ్య దశదిన కర్మలో ప్రముఖుల నివాళులు
చింతకాని, అక్టోబర్ 29 (పీపుల్స్ వాయిస్ ): చింతకాని మండలానికి చెందిన బల్లి పెద్ద వీరయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి, ఆయన స్మృతులను గుర్తుచేసుకున్నారు.
పెద్ద వీరయ్య మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.