Poples Voice
Date of Publish : 30/10/2026, 5:08 pm
Published by PEOPLES VOICE

వస్తువులే ప్రయోగశాలలు.. అనుభవమే విజ్ఞానం! తక్కువ ఖర్చు.. ఖర్చులేని పరికరాలతో సైన్స్ ప్రయోగాలు

  • జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం
  • 2024 డీఎస్సీ ద్వారా నియమితులైన విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులకు అవగాహన
  • రిక్కా బజార్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం నిర్వహణ
  • తక్కువ ఖర్చు, ఖర్చులేని పరికరాలతో సైన్స్ ప్రయోగాల ప్రదర్శన
  • విద్యార్థి కేంద్రంగా ప్రయోగాత్మక సైన్స్ బోధన చేయాలని అలవాల నాగేశ్వరరావు సూచన
  • ప్రయోగాల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెరుగుతాయని వెల్లడి
  • గత 38 ఏళ్లుగా జేవీవీ ఆధ్వర్యంలో బాలోత్సవాలు, బాలమేళాల నిర్వహణ
  • కె.వి.కె. శర్మ, కె. రామారావు, బి. హనుమ, ఇ. వెంకటేశ్వర్లు రిసోర్స్ పర్సన్లుగా ప్రయోగాల ప్రదర్శన
  • జిల్లా సైన్స్ అధికారి, విద్యాశాఖ అధికారులు, జేవీవీ ప్రతినిధులు పాల్గొన్నారు

వస్తువులే ప్రయోగశాలలు.. అనుభవమే విజ్ఞానం!

తక్కువ ఖర్చు.. ఖర్చులేని పరికరాలతో సైన్స్ ప్రయోగాలు

ఖమ్మం, అక్టోబర్ 30 (పీపుల్స్ వాయిస్):

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ బోధన ప్రయోగాత్మకంగా, విద్యార్థి కేంద్రంగా సాగాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అలవాల నాగేశ్వరరావు అన్నారు.

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 2024 డీఎస్సీ ద్వారా నియమితులైన జిల్లా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులకు రిక్కా బజార్ ఉన్నత పాఠశాలలో తక్కువ ఖర్చుతో, ఖర్చు లేకుండా లభించే పరికరాలతో వివిధ సైన్స్ ప్రయోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలవాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు స్వయంగా ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవడం వల్ల విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెరగడంతో పాటు శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని తెలిపారు. ఈ లక్ష్యంతో జనవిజ్ఞాన వేదిక గత 38 సంవత్సరాలుగా తక్కువ ఖర్చు, ఖర్చులేని వస్తువులతో అనేక బాలోత్సవాలు, బాలమేళాలు నిర్వహిస్తోందని వివరించారు.

అనంతరం రిసోర్స్ పర్సన్లు కె.వి.కె. శర్మ, కె. రామారావు, బి. హనుమ, ఇ. వెంకటేశ్వర్లు వివిధ ప్రయోగాలను స్వయంగా ప్రదర్శించి ఉపాధ్యాయులకు వాటి నిర్వహణ విధానంపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సీఎంఓ ప్రవీణ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి ఆర్. శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. శాంత, మాధవరావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్, మోహన్, సూర్యనారాయణ, శ్రీరాములు, పి. రామకృష్ణ, టి. రామకృష్ణ, రాఘవయ్య, డాన్ బాస్కో తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save