చింతకానిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల పట్టివేత!
గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు.. పరారీలో పెనుగొండ సాయి!
చింతకాని, అక్టోబర్ 31 (పీపుల్స్ వాయిస్)
చింతకాని మండలం నరసింహపురం సమీపంలో పోలీసుల పెట్రోలింగ్ సమయంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. అగ్రహారం కాలనీకి చెందిన వినయ్, విజయ్‌లు గాంధీనగర్ కాలనీకి చెందిన పెనుగొండ సాయి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై ఎస్సై జి. నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.