Poples Voice
Date of Publish : 31/10/2026, 8:02 pm
Published by PEOPLES VOICE

చిన్నమండవలో పౌర హక్కులపై అవగాహన సదస్సు

చిన్నమండవలో పౌర హక్కులపై అవగాహన సదస్సు

చింతకాని, అక్టోబర్ 31 (పీపుల్స్ వాయిస్):

చింతకాని మండలం పరిధిలోని చిన్నమండవ గ్రామంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పర్చరామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు పౌర హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పర్చ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తహసీల్దార్ దినపల్లి కరుణశ్రీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలలు, దేవాలయాలు సహా అన్ని సామాజిక ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల మత భేదాలు లేకుండా ఐకమత్యంతో జీవించాలని కోరారు.

ఎస్సై నరేష్ మాట్లాడుతూ గ్రామాల్లో కుల వివక్షకు గురైనా, కులం పేరుతో ఎవరైనా దూషించినా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు.

వసతి గృహ సంక్షేమ అధికారి కొత్త వెంకటేశ్వరరావు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామస్తులు మండల అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తంగిరాల మాధవి, ఆర్‌ఐ ఏకవీర, జీపీఓ లాల్ జాన్ పాషా, వార్డు సభ్యులు గుండ్ల బేబీ రాణి, కాశీమాల సరిత, గుండ్ల భద్రమ్మ, గుండ్ల అనిల్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save