Poples Voice
Date of Publish : 01/11/2026, 3:16 pm
Published by PEOPLES VOICE

నవంబర్ 5న రామ నరసయ్య 50వ వర్ధంతి సభను జయప్రదం చేయాలి_ ఎస్.కె లాల్మీయ పిలుపు

నవంబర్ 5న రామ నరసయ్య 50వ వర్ధంతి సభ

వర్ధంతి సభను జయప్రదం చేయాలని  ఎస్.కె లాల్మీయ పిలుపు

కొణిజర్ల నవంబర్ 1 (పీపుల్స్ వాయిస్):

ప్రజా పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల స్మారకార్థం నవంబర్ 5న రామ నరసయ్య నగర్‌లో నిర్వహించనున్న 50వ వర్ధంతి సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ వైరా డివిజన్ కార్యదర్శి ఎస్కే లాల్మియా కోరారు.

భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం సాగిన ప్రజా పోరాటాల్లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో వర్ధంతి సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 కార్యక్రమంలో భాగంగా నవంబర్ 5వ తేదీన ఉదయం 10 గంటలకు రామ నరసయ్య నగర్‌లో 50వ వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి సీహెచ్ పుల్లయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు, జి. రామయ్య తదితరులు పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు.

అదే రోజు గ్రామంలో ప్రదర్శన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాశం అప్పారావు, వడ్డే సత్యం, తడకమళ్ల వెంకన్న, గుగులోతు శివ, గండికోట లక్ష్మణ్, గండికోట బాబు, రాపోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save