Poples Voice
Date of Publish : 02/11/2026, 11:49 am
Published by PEOPLES VOICE

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: సర్పంచ్ చాపలమడుగు వీరబాబు

తిరుమలాపురం 7వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ శుభ్రత పనులు

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: సర్పంచ్ చాపలమడుగు వీరబాబు

చింతకాని, నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):

చింతకాని మండల పరిధిలోని తిరుమలాపురం గ్రామంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో సర్పంచ్ చాపలమడుగు వీరబాబు ఆధ్వర్యంలో 7వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ శుభ్రత పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించడంతో పాటు కాలువల ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను పంచాయతీ సిబ్బంది తొలగించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వీరబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పంచాయతీ ఆధ్వర్యంలో నిరంతరం పారిశుధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను డ్రైనేజీ కాలువల్లో వేయకుండా సహకరించాలని కోరారు. స్వచ్ఛభారత్ ట్రాక్టర్‌కు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. కాలువల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కొండపల్లి ఉమారాణి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save