Poples Voice
Date of Publish : 02/11/2026, 10:06 pm
Published by PEOPLES VOICE

పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎంపీ రవిచంద్ర ప్రత్యేక దృష్టి.. పలువురితో ఫారం-18 పూర్తి చేయించిన ఎంపీ

పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ వద్దిరాజు

పలువురితో ఫారం-18 దరఖాస్తులు పూర్తి చేయించిన రవిచంద్ర

పాల్వంచ, నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం పాల్వంచలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించారు. పట్టణంలోని 38వ డివిజన్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించి ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా, చురుగ్గా నిర్వహించాలని నాయకులకు సూచించారు.అనంతరం పాల్వంచ రూరల్ మండలం పాండురంగాపురంలో పట్టభద్రులను స్వయంగా కలిసి ఫారం-18 దరఖాస్తులను అందజేశారు. పలువురితో దరఖాస్తులను పూర్తి చేయించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వెంట కార్పొరేటర్ సింధూ తపస్వి, బీఆర్ఎస్ నాయకులు పూసల విశ్వనాథం, మల్లెల రవిచంద్ర, భీమా శ్రీధర్, రాజు గౌడ్, కొట్టి వెంకటేశ్వరరావు, అనుదీప్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save