Poples Voice
Date of Publish : 03/11/2026, 1:34 pm
Published by PEOPLES VOICE

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

కొణిజర్ల మండలంలో వ్యవసాయ భూముల సందర్శన.. రైతులతో పంటల స్థితిగతులపై చర్చ

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

ఎల్‌నినో ప్రభావంతో పంటలపై ఏర్పడిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం కొణిజర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొణిజర్ల గ్రామంలోని వ్యవసాయ భూములను సందర్శించి పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల ఎదుగుదల, ప్రస్తుత పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురవుతున్న సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, దొండపాటి రమేష్, తోట రామాంజనేయులు, కొణిజర్ల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save