Poples Voice
Date of Publish : 03/11/2026, 5:47 pm
Published by PEOPLES VOICE

కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ

కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి – టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ పిలుపు

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. 2027 జనవరి 9, 10, 11 తేదీల్లో పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం రామనరసింహ విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఏ. వెంకన్న అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో సుమారు 40 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ, వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను విస్తరించి కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి 12 గంటల పని విధానానికి మార్గం సుగమం చేసిందని ఆరోపించారు. కార్మికుల సమ్మె హక్కును సైతం కాలరాస్తున్నారని మండిపడ్డారు.కార్మిక హక్కులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాలకు టీయూసీఐ అఖిల భారత జాతీయ మహాసభలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జనవరి 9న వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 10, 11 తేదీల్లో వివిధ రాష్ట్రాలు, రంగాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఎంపికైన కార్మిక ప్రతినిధులు మహాసభల్లో పాల్గొంటారని వెల్లడించారు.రాష్ట్రంలోని మున్సిపల్, ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామపంచాయతీలు, కేజీబీవీలు, అంగన్‌వాడీలు, ఆశా తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 6ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంతో పాటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. పాలకులు మాటలతో కార్మికులను మోసం చేస్తున్నారే తప్ప, వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సి.వై. పుల్లయ్య, కొయ్యల శ్రీనివాస్, డి. శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆవుల అశోక్, పగిడికత్తుల రామదాసు, జిల్లా నాయకులు గోస్ పుల్లయ్య, ధారావత్ సక్రు, కే. పుల్లారావు, పేరబోయిన ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save