Poples Voice
Date of Publish : 04/11/2026, 6:32 pm
Published by PEOPLES VOICE

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు!

జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు!

రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగాలి.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన

పెనుబల్లి, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రాజెక్ట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదేవికి పూలు, వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండటం రైతులకు, ప్రజలకు ఎంతో ఆనందదాయకమైన విషయమని అన్నారు. జలవనరులు సమృద్ధిగా ఉండటం ప్రాంత అభివృద్ధికి, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గంగాదేవిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన్ కమల్ పాషా, కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save