Poples Voice
Date of Publish : 04/11/2026, 9:27 pm
Published by PEOPLES VOICE

ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు

  • ఖమ్మంలో 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు
  • 900 మంది క్రీడాకారులతో జాతీయ కరాటే పోటీలు

ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

సుమన్ షాటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ జల్లెల శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తండ్రి స్వర్గీయ నారాయణ జ్ఞాపకార్థం ఖమ్మం వర్తక సంఘం ఆవరణలో ఈ జాతీయ స్థాయి పోటీలను నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు, కరాటే గ్రాండ్ మాస్టర్ సుమన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించడంతో పాటు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఖమ్మం బుర్హాన్‌పురంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వద్దిరాజు రవిచంద్రను కలిసిన అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ జల్లెల శ్రీనివాసరావు శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save