ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు
ఖమ్మం ,నవంబర్ 5 (పీపుల్స్ వాయిస్)
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంజీవయ్య భవన్‌లో జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవడం మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రధాన కార్యదర్శి స్వరూప జిల్లా సీనియర్ నాయకులు జనార్ధన్ డీసీసీ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మైనార్టీ ఉపాధ్యక్షులు అజ్గర్ జిల్లా సీనియర్ నాయకులు శీను ఎండి ఫాదర్ పట్టణ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక సేన తరఫున గౌరవ అధ్యక్షులు అంబేద్కర్ నాగరాజు పాల్గొన్నారు.