ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన సర్పంచ్ మొగిలి కృష్ణయ్య..!
చింతకాని, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
ప్రొద్దుటూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పాఠశాల యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ మొగిలి కృష్ణయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పెంట్యాల పుల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గ్రామపంచాయతీ కార్యదర్శి రజియా వార్డు మెంబర్ గొర్రె ముచ్చు జాను పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.