Poples Voice
Date of Publish : 07/11/2026, 8:30 am
Published by PEOPLES VOICE

బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత!

  • బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి
  • ఐదుగురు పట్టివేత.. రూ.10,400 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత!

రూ.10,400 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం.. మరో ఇద్దరు పరారీ

ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం నగర శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలపేట గ్రామ శివారులో ఖాళీ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడి నిర్వహించారు.టాస్క్‌ఫోర్స్ సీఐ ఉదయ్ కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి నుంచి రూ.10,400 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.పట్టుబడిన వారిని ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఎస్.కె. రఫీ, షేక్ హుస్సేన్, మొగిలి ఉపేందర్, మద్దనపు సత్యనారాయణ, లకావత్ బాలు ఉన్నారు. పరారీలో ఉన్నవారిని జరాల రమేష్, చల్ల అశోక్‌గా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save