Poples Voice
Date of Publish : 07/11/2026, 8:40 am
Published by PEOPLES VOICE

పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం!

  • ఇంటర్‌లో 985 మార్కులు సాధించిన చేబ్రోలు గౌతమికి రూ.64 వేల ఆర్థిక సాయం
  • భవిష్యత్తులోనూ విద్యాభ్యాసానికి అండగా ఉంటామని గోపా భరోసా

పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం!

ఇంటర్‌లో 985 మార్కులు సాధించిన చేబ్రోలు గౌతమికి ఘన సన్మానం.. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా

ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో ఖమ్మం జిల్లా గౌడ అధికారుల, ప్రజాప్రతినిధుల సంఘం (గోపా) పేద విద్యార్థిని చేబ్రోలు గౌతమికి అండగా నిలిచింది. తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదువుతూ ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 985 మార్కులు సాధించిన గౌతమి విద్యాభ్యాసానికి, వ్యక్తిగత అవసరాలకు రూ.64 వేల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఖమ్మం బాలాజీనగర్‌లోని బొల్లికొండ శ్రీదేవి నర్సింగ్ హోమ్‌లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన గౌతమి ప్రతిభను గుర్తించిన గోపా జిల్లా కమిటీ ఆమెకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సంఘం సభ్యులు, దాతల సహకారంతో రూ.64 వేల విరాళాలను సమీకరించి విద్యార్థినికి అందజేశారు. ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గౌతమిని ఘనంగా సన్మానించి అభినందించారు. గత అక్టోబర్‌లో నిర్వహించిన గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ఇతర విద్యార్థులను కూడా ఈ సందర్భంగా సత్కరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. గౌతమి చదువులో సాధించిన ప్రతిభ అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో విద్యాభ్యాసానికి లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి గౌతమి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే అవకాశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఖమ్మం జిల్లా గోపా అధ్యక్షుడు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గౌడ్ మాట్లాడుతూ.. గౌతమి చదువు నిరాటంకంగా కొనసాగేందుకు సంఘం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఆమె విద్యాభ్యాసానికి ఆటంకం కాకుండా అవసరమైన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.జిల్లా గోపా ప్రధాన కార్యదర్శి బొలగాని శ్రీనివాసరావు గౌడ్ మాట్లాడుతూ.. గౌడ విద్యార్థుల్లో విద్యా ప్రతిభను ప్రోత్సహించేందుకు సంఘం ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కారాలను అందజేస్తోందన్నారు. గౌతమి పరిస్థితిని తెలుసుకున్న అనంతరం సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేయగా, అందరూ సానుకూలంగా స్పందించి విరాళాలు అందించారని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో చదువులో రాణించాలని గౌతమికి సూచించారు.జిల్లా గోపా కోశాధికారి గండు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ.. గౌతమి విద్యాభ్యాసానికి అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని పేర్కొన్నారు. విరాళాల సేకరణకు చొరవ చూపిన వంగాల కొండలరావు గౌడ్‌ను మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్‌తో పాటు జిల్లా గోపా కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా కొండలరావు గౌడ్ మాట్లాడుతూ.. గౌతమి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఆమెకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గోపా కమిటీ సహకారంతో ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.బిచ్చాల తిరుమలరావు గౌడ్ మాట్లాడుతూ.. గౌడ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం గోపా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. కత్తి నెహ్రూ గౌడ్, చిత్తలూరి నరసయ్య గౌడ్, గుడిద శ్రీనివాస్ గౌడ్ తదితరులు కూడా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో గోపా జిల్లా ఉపాధ్యక్షులు బొల్లికొండ దర్గయ్య గౌడ్, బెల్లంకొండ శరత్ గౌడ్, తోడేటి దుర్గాప్రసాద్, సింగం జనార్దన్ గౌడ్, టేకుమట్ల హుస్సేన్ గౌడ్, మారగాని నారాయణ గౌడ్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనంత హరీష్ గౌడ్, కొండి కుమార్ స్వామి గౌడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి రత్నం గౌడ్, వత్సవాయి ఝాన్సీ గౌడ్, చేబ్రోలు ఇంద్రసేన గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save