Poples Voice
Date of Publish : 09/11/2026, 8:24 am
Published by PEOPLES VOICE

సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు!

  • ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంట్లో వేడుకలు
  • సొంతింటి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చిన కాంగ్రెస్ నాయకులు
  • పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం: సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినాల శ్రీనివాస్

సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు!

చింతకాని, నవంబర్ 09 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా వందనం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటిని అందంగా అలంకరించి, దీపాలు వెలిగించి, టపాసులు కాలుస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. సొంతింటిలో దీపావళి జరుపుకుంటున్న లబ్ధిదారుల కుటుంబంతో సంతోషాలను పంచుకుని ఆత్మీయతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ (BLA) మిట్టపల్లి కొండలరావు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం లబ్ధిదారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు. సొంతింటిలో దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకోవడం లబ్ధిదారులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అమర్లపూడి శ్రీను ( సిపిఐ పార్టీ ), గ్రామ కార్యదర్శి అయినాల శ్రీనివాస్, గ్రామ ఉపాధ్యక్షుడు ఎస్.కె. మోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save