డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు..
మధిర, నవంబర్ 09 (పీపుల్స్ వాయిస్):
కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు, కేవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోట రాంబాబును ఎమ్మార్పీఎస్ నాయకులు జొన్నలగడ్డ పుల్లారావు, గుండ్ల రాంబాబు మధిరలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సంతోషాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.