Poples Voice
Date of Publish : 10/11/2026, 7:49 pm
Published by PEOPLES VOICE

డీసీసీబీ రుణ పథకంతో ఎలక్ట్రిక్ స్కూటర్.. చింతకాని బ్రాంచ్‌లో లబ్ధిదారుడికి అందజేత

  • డీసీసీబీ చింతకాని బ్రాంచ్‌ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ మంజూరు
  • సీతంపేటకు చెందిన కొమ్ము గోపయ్యకు లబ్ధి
  • టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేత
  • అతి తక్కువ వడ్డీతో వాహన రుణాలు అందిస్తున్న డీసీసీబీ
  • రుణ పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి: బ్రాంచ్ మేనేజర్ రీటా

డీసీసీబీ రుణ పథకంతో ఎలక్ట్రిక్ స్కూటర్.. చింతకాని బ్రాంచ్‌లో లబ్ధిదారుడికి అందజేత

తక్కువ వడ్డీకే వాహన రుణాలు.. ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి: మేనేజర్ రీటా

చింతకాని, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):

ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా రుణ సదుపాయాలను కల్పిస్తూ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఖమ్మం డీసీసీబీ పరిధిలోని చింతకాని శాఖ ద్వారా సీతంపేట గ్రామానికి చెందిన కొమ్ము గోపయ్యకు టీవీఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వాహన రుణ పథకం కింద మంజూరు చేశారు.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సీహెచ్. రీటా మాట్లాడుతూ.. బ్యాంకు ద్వారా అర్హులైన ఖాతాదారులకు తక్కువ వడ్డీ రేట్లతో వాహన రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వల్ల ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఖాతాదారులు బ్యాంకు అందిస్తున్న రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకుని వాటిని వినియోగించుకోవాలని ఆమె కోరారు. వాహన రుణం పొందాలనుకునే వారు అవసరమైన ధ్రువపత్రాలతో చింతకాని బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వంకాయలపాటి దీపిక, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జె. నాగార్జున, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save