Poples Voice
Date of Publish : 10/11/2026, 8:15 pm
Published by PEOPLES VOICE

కేటీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు

కేటీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు

తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వక భేటీ.. మిఠాయిలు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ. రామారావును పలువురు పార్టీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వీ. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, నన్నపనేని నరేందర్, పార్టీ నాయకులు కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిలు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు.ఈ సందర్భంగా కేటీఆర్‌కు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వేళ పార్టీ నేతల ఆత్మీయ కలయిక తెలంగాణ భవన్‌లో సందడి నెలకొల్పింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save