Poples Voice
Date of Publish : 10/11/2026, 8:29 pm
Published by PEOPLES VOICE

నిరుపేద డాడీ లంబాడీలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

నిరుపేద డాడీ లంబాడీలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

మంత్రి పొంగులేటి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డికి వినతిపత్రం

ఖమ్మం, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం నగర పరిధిలో నివసిస్తున్న నిరుపేద డాడీ లంబాడి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర డాడీ లంబాడి హక్కుల సాధన సమితి ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సంఘం ప్రతినిధులు, మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సహాయకులు, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. అనంతరం ఆయనకు వినతిపత్రం అందజేశారు.సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఘునాయక్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి డుంగ్రోత్ శేఖర్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో ఎస్టీ కమిషన్ ద్వారా లంబాడీలకు ప్రత్యేక గుర్తింపు కల్పించేందుకు కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తుంబూరు దయాకర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఖమ్మం నగరంలో అనేక నిరుపేద డాడీ లంబాడి కుటుంబాలు సొంత ఇళ్లు, ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రతినిధులు వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన ఆయా కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డుంగ్రోత్ కిషోర్ నాయక్, దేవత్ కాళిదాస్, దేవత్ అంకుష్, ధోణవాన్ వెంకట్రావు నాయక్, ధోణవాన్ నాగరాజు, రత్నావత్ ఉపేందర్, డుంగ్రోత్ సుశీల్, డుంగ్రోత్ వీరబాబు, మహిళా ప్రతినిధులు డి. పుష్ప, ధోణవాన్ కీర్తి, దేవత్ మోతి, డి. సునీత తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save