Poples Voice
Date of Publish : 10/11/2026, 8:53 pm
Published by PEOPLES VOICE

వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో బాలుడి హత్య!

  • చిన్నకొరుకొండలో వెలుగుచూసిన బాలుడి హత్య ఘటన
  • వివాహేతర సంబంధాన్ని చూశాడని 15 ఏళ్ల రవిపై కుట్ర
  • కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించినట్లు పోలీసుల వెల్లడి
  • చికిత్స పొందుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి మృతి
  • నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో బాలుడి హత్య!

ఏకాంతంగా ఉండటాన్ని చూసిన పదో తరగతి విద్యార్థి రవి.. కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించిన నిందితులు

కల్లూరు, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. తమ వివాహేతర సంబంధాన్ని బయటపెడతాడనే భయంతో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడిని మహిళ, ఆమెతో సంబంధం ఉన్న యువకుడు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కల్లూరు మండలం చిన్నకొరుకొండ గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ చిన్నకొరుకొండలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన అజయ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల రవి చూశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతానని వారిని హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో తమ సంబంధం బయటపడుతుందనే భయంతో రవిని హతమార్చాలని ఇద్దరూ కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత నెల 24న రవిని గ్రామం బయటకు తీసుకెళ్లి, కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన రవిని కుటుంబ సభ్యులు గత నెల 25న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అపర్ణ, అజయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save